– జాతీయ అండర్-20 పోటీలకు జట్టు ఎంపిక
హైదరాబాద్ : 4వ జాతీయ ఫెన్సింగ్ అండర్-20 చాంపియన్‌షిప్స్‌కు తెలంగాణ రాష్ట్ర జట్టును శుక్రవారం ఎంపిక చేశారు. గచ్చిబౌలిలోని గాడియం ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన అంతర్ జిల్లాల అండర్-20 పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోటీపడిన ఫెన్సర్లు సత్తా చాటారు. నాలుగు విభాగాల్లో 64 మంది ఫెన్సర్లు పోటీపడగా..ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఫెన్సర్లను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. తనిష్క్ జాదవ్, మణికంఠ, ఎలియసుద్దీన్, నిఖిలేశ్ (మెన్ ఫాయిల్), మురళీ, లోకేశ్, వర్షిత్, సంజరు (మెన్ ఈపీ), ఇమ్రాన్, ఈషన్, శివ, శ్రావణ్ (మెన్ సబ్రె) సహా ఉమెన్స్ విభాగంలో 12 మంది ఫెన్సర్లు ఎంపికయ్యారు.