సంపూర్ణ సురక్ష హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన

–  గాంధీ చౌక్ లోని లేబర్ అడ్డ వద్ద స్టాల్ ను ప్రారంభించిన కార్పొరేటర్
నవతెలంగాణ కంఠేశ్వర్
స్నేహ టీ ఐ జిల్లా కేంద్రం లోని గాంధీ చౌక్ లోని లేబరు అడ్డా వద్ద సంపూర్ణ సురక్ష హెచ్‌ఐవి/ఎయిడ్స్ అవగాహన కార్యక్రమం స్టాల్‌ను కార్పొరేటర్ అబ్దుల్ ఖుద్దూస్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్వో సుదర్శనం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెచ్ఐవి పరీక్షల సేవలను పూర్తిగా ఉచితంగా ఉపయోగించుకోవాలని వారి హెచ్ఐవి స్థితిని తెలుసుకుని సురక్షితంగా ఉండాలని చెప్పారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సరఫరా చేయబడిన ఏ ఆర్ టి మందులను ఉచితంగా ఉపయోగించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.   తప్పనిసరిగా హెచ్ఐవి/ఎయిడ్స్ నుండి రక్షించడానికి కండోమ్‌లను ఉపయోగించాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపిఎం సుధాకర్, జిల్లా టీవీ అండ్ హెచ్ఐవి  కో ఆర్డినేటర్ రవి గౌడ్, టిఆర్ఎస్ ఈ కౌన్సెలర్ వర్లక్ష్మి , ప్రోగ్రాం మేనేజర్ ఎస్ కె మోజాహిద్ అహ్మద్, ఆనంద్ సాగర్ గౌడ్, జిఎన్ఎమ్ నీలేమ, & కౌన్సెలర్ గౌతమి  సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love