జేఎన్‌యూలో ఏబీవీపీ దౌర్జన్యం

జేఎన్‌యూలో ఏబీవీపీ దౌర్జన్యంన్యూఢిల్లీ : జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వ విద్యాలయం(జేఎన్‌యూ)లో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ మరోమారు కండకావరాన్ని ప్రదర్శించింది. గుర్తింపు విద్యార్థి సంఘం ఎన్నికల ముందు శుక్రవారం సాయంత్రం యూనియన్‌ జనరల్‌ బాడీ సమావేశం నిర్వహిస్తుండగా.. మారణాయుధాలతో సమావేశ మందిరంలోకి చొచ్చుకొచ్చిన ఏబీవీపీ కార్యకర్తలు విచక్షణరాహిత్యంగా దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఎస్‌ఎఫ్‌ఐ నేత, జేఎన్‌యూ అధ్యక్షులు ఐషి ఘోష్‌తో సహా పలువురు గాయపడ్డారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, పరిశోధక విద్యార్థి ఉన్మేష్‌ తలపై తీవ్ర గాయమైంది. ఎన్నికలు జరిగితే ఘోర పరాజయం తప్పదన్న భయంతోనే క్యాంపస్‌లో ఏబీవీపీ, కాషాయ మూకలు హింసకు తెరలేపారని ఎస్‌ఎఫ్‌ఐ తదితర సంఘాల నాయకులు విమర్శించారు. ఈ హింసాకాండ నేపథ్యంలో జనరల్‌ బాడీ సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేసినట్లు ఐషి ఘోష్‌ తెలిపారు. ఛండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల తరహాలో ఇక్కడ విద్యార్థి గుర్తింపు సంఘ ఎన్ని కలను కూడా రిగ్గింగ్‌ చేసేందుకు ఏబీవీపీ ప్రయత్నిస్తోందన్నారు. కాగా, ఢిల్లీ యూనివర్సిటీలో శుక్రవారం రాత్రి ఏఐఎస్‌ఏ నిర్వహించిన కార్య క్రమంలోనూ ఏబీవీపీ కార్యకర్తలు విద్యార్థులపైనా, ఉపాధ్యాయులపైనా దాడులకు పాల్పడింది.

Spread the love