నవతెలంగాణ – శంకరపట్నం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఏసీ డీపీఓ అరవింద అన్నారు. శుక్రవారం శంకరపట్నం మండల పరిదిలోని, కన్నాపూర్ గ్రామంలో గల ఐ సి డి ఎస్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ అభియాన్, ప్రీ స్కూల్ చిన్నారులతో ఆక్టివిటీస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి హాజరైన ఏసీడీపీఓ అరవింద మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళలు చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ, మహిళల రక్షణ చిన్నారుల రక్షణ ధ్యేయంగా ప్రభుత్వాలు సేవలు అందిస్తున్నాయని అర్హులైన ప్రతి ఒక్కరు అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోషన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో ఐదు సంవత్సరాలలోపు చిన్నారులకు ప్రీస్కూల్ ఆక్టివిటీ, చిన్నారుల ఎదుగుదల గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య రక్షణ తోపాటు పౌష్టిక ఆహారంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ స్రవంతి, డాక్టర్ శ్వేత, అంగన్వాడి టీచర్లు గాజుల కాంత, కాటం రాజమణి, ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.