– జనరల్ కేటగిరీలోనూ పోటీ పడే అవకాశం
– సమర్పణకు తుదిగడువు అక్టోబర్ 20
– నవంబర్ 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో రాతపరీక్షలు
– జిల్లాలు, సబ్జెక్టులు, రోస్టర్ వారీగా పోస్టుల వివరాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో 2,598 పోస్టులు మహిళ లకే కేటాయించబడ్డాయి. మిగిలిన 2,491 పోస్టులు జనరల్ కేటగిరీతో పాటు రిజర్వేషన్లకు అభ్యర్థులకు ఉన్నా యి. అయితే జనరల్ కేటగిరీలో ఉండే పోస్టులకు మహిళలు పోటీపడే అవకాశ మున్నది. 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లాస్థాయి నియామక కమిటీ (డీఎస్సీ) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యా శాఖ ఈనెల ఎనిమిదిన విడుదల చేసిన విషయం తెలిసిందే. జిల్లాలు, పోస్టులు, కేటగిరీలు, సబ్జెక్టు, మాధ్యమం, రోస్టర్ వారీగా పూర్తి వివరాలను విద్యాశాఖ మంగళవారం ప్రకటించింది. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్ ను గురువారం జారీ చేసింది.
1,739 స్కూల్ అసిస్టెంట్, 611 లాంగ్వేజ్ పండి తులు, 164 వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీ), 2,575 సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) కలిపి మొత్తం 5,089 పోస్టులు న్నాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 358 పోస్టులు, అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 43 పోస్టులు భర్తీ అవుతున్నా యి. ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులే అర్హులుగా ఉంటారని స్పష్టం చేసింది. బుధవారం నుంచి ఉపాధ్యాయ పోస్టుల కోసం దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వాటి సమ ర్పణకు వచ్చేనెల 20 వరకు తుదిగడువు ఉన్నది. మొదటిసారిగా డీఎస్సీ రాతపరీక్ష లను నవంబర్ 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (సీబీఆర్టీ) విధానంలో నిర్వహిస్తు న్నారు. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 44 ఏండ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేండ్లు సడలింపు ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ అది వర్తిస్తుంది. వికలాంగులకు మాత్రం పదేండ్లు సడలింపు ఉంటుంది. అయితే మొదటిసారి బైలింగ్వల్ (రెండు భాషల్లో) ప్రశ్నాపత్రం అందుబాటులోకి తెస్తున్నారు. ఉదాహరణకు తెలుగు/ఇంగ్లీష్, హిందీ/ఇంగ్లీష్ ప్రశ్నాపత్రాలుంటాయి. 11 జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, సంగారెడ్డిలో పరీక్షలను నిర్వహిస్తారు. అయితే 160 ప్రశ్నలకు 2.30 గంట లపాటు డీఎస్సీ రాత పరీక్షలుంటాయి. వాటిని 80 మార్కులుగా పరిగణి స్తారు. టెట్‌లో వచ్చిన మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. ఆ రెండింటినీ కలిపి డీఎస్సీ మెరిట్ జాబితాను రూపొందిస్తారు. ఇతర వివరాలకు www.schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.
ఉపాధ్యాయ పోస్టుల వివరాలు
మాధ్యమం కేటగిరీ పోస్టులు
తెలుగు ఎస్జీటీ 2,028
ఎస్‌ఏ 1,368
పీఈటీ 127
ఎల్‌పీ 319
ఉర్దూ ఎస్జీటీ 448
ఎస్‌ఏ 138
పీఈటీ 32
ఎల్‌పీ 53
హిందీ ఎస్జీటీ 8
ఎస్‌ఏ 135
పీఈటీ 233
ఎల్‌పీ 1
ఇంగ్లీష్ ఎస్జీటీ 40
ఎస్‌ఏ 92
పీఈటీ 3
ఎల్‌పీ 0
కన్నడ ఎస్జీటీ 9
ఎస్‌ఏ 1
పీఈటీ 1
ఎల్‌పీ 1
మరాఠీ ఎస్జీటీ 25
ఎస్‌ఏ 5
పీఈటీ 0
ఎల్‌పీ 5
బెంగాలీ ఎస్జీటీ 16
ఎస్‌ఏ 0
పీఈటీ 0
ఎల్‌పీ 0
తమిళం ఎస్జీటీ 1
ఎస్‌ఏ 0
పీఈటీ 0
ఎల్‌పీ 0
మొత్తం 5,089