సజావుగా సాగిన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ..

– మండలంలో సుమారు 12,020 దరఖాస్తుల స్వీకరణ 

– ప్రజాపాలనకు ప్రజల్లో విశేష స్పందన 

నవతెలంగాణ-బెజ్జంకి 
డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు నిర్వహించిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మండలంలో సజావుగా సాగింది.అయా గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. మండల వ్యాప్తంగా సుమారు 12,020 అభయహస్తం దరఖాస్తులను ప్రజల వద్ద నుండి స్వీకరించామని దరఖాస్తుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నామని ఎంపీడీఓ దమ్మని రాము తెలిపారు. ప్రభుత్వాదేశానుసారం మండలంలో అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ముగిసిందని ఎంపీడీఓ తెలిపారు.
Spread the love