ఇవాళ్టి నుంచే టెట్ దరఖాస్తులు స్వీకరణ

నవతెలంగాణ – హైదరాబాద్: ఇవాళ్టి నుంచే టెట్ దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆసక్తి గల అభ్యర్థులు ఈరోజు (మంగళవారం) నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పేపర్-1కు డీఈడీ, పేపర్-2కు బీఈడీ పూర్తి చేసిన అర్హులు. జనవరి 1 నుంచి 20 వరకు టెట్‌ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు తెలంగాణ అధికారులు.

Spread the love