– జిపి కార్మికుల ఆందోళనకు మద్దతు కార్మికులకు ఇన్సూరెన్స్ చేయించిన మాజీ ఎమ్మెల్యే అరుణా తార,
నవతెలంగాణ- మద్నూర్
పంచాయతీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టిన ఆందోళనకు బిజెపి పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుందని యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పి ఎం పోస్ట్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని ప్రమాద బీమా 10 లక్షలు పొందాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే కామారెడ్డి జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షురాలు అరుణా తార తెలిపారు. కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని పేర్కొన్నారు. 85/127 కార్మికుల కు పీఎం పోస్టల్ ఇన్సూరెన్స్ 399/ను జిపి కార్మికులకు సహకరించారు. చేయ పదిలక్షల ఏక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పీఎం పోస్ట్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరు చేయించు కోవాలని నియోజకవర్గంలోని ప్రజలకు సూచించారు కేంద్రంలో గల బీజేపీ ఎన్ డి ఏ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో ఈ పీఎం పోస్ట్ ఇన్సూరెన్స్ ముఖ్య మైనది ఆమె తెలిపారు. నియోజకవర్గ ప్రజలు ఇలాంటి ఇన్సూరెన్సును సద్వినియోగం పంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ డోంగ్లి పార్టీ మండల అధ్యక్షులు బి హనుమాన్లు ధనుంజయ్ పటేల్ వీరితో పాటు నాయకులు సిహెచ్ హనుమాన్లు కె యాదవ రావు శ్రీధర్ పంతులు అరుణ్ పటేల్ అజయ్ తమ్మేవారు శ్రీ పాద పటేల్ విట్టల్ వెంకట్ కాలే అనిల్ తదితరులు పాల్గొన్నారు.