– దెబ్బతిన్న కాంగ్రెస్ నాయకుల కార్లు
నవతెలంగాణ-గరిడేపల్లి
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కాన్వారులో ప్రమాదం జరిగింది. మంత్రి హుజూర్‌నగర్ నుంచి జాన్‌పహాడ్ ఉర్సుకు వెళ్తుండగా మధ్యలో గరిడేపల్లిలో స్థానిక నాయకులు, కార్యకర్తలు కనబడటంతో మంత్రి కారు ఆపారు. కానీ కాన్వారు వెనుక వస్తున్న పలువురు కాంగ్రెస్ నాయకుల కార్లు సడన్ బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి మొత్తం ఆరు కార్లు ఢకొీన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కార్ల ముందు వెనక భాగాలు దెబ్బతిన్నాయి. కాన్వారులోని అధికార వాహనాలకు మాత్రం ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. ఈ సంఘటనతో కొద్దిసేపు మిర్యాలగూడ కోదాడ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. వెంటనే మంత్రి కాన్వారు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పోలీసులు ట్రాఫిక్‌ను చక్కదిద్దారు.