– కాలి బుడిదైన నగదు, బంగారం ..
– బాధిత కుటుంబాన్ని అదుకుంటం..
– ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి..
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని చంద్రయాన్ పల్లి గ్రామంలో ఆదివారం ప్రమాద వశాత్తు నివాసపు గృహం దగ్ధమైన ఘటనలో నగదు బంగారం, నిత్యవసర వస్తువులు, బట్టలు తదితర వస్తువులు కాలిబుడిదైనట్లు స్థానికులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం చంద్రయాన్ పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ వాటర్ మెన్ గా పని చేస్తున్న బర్దిపూర్ గంగాధర్ కు చెందిన నివాసపు గృహం లో ప్రమాద వశాత్తు మంటలు వ్యాపించి బీరువాలో తన భార్య కంటికి ఆపరేషన్ నిమిత్తం బాయటి నుండి ఒక లక్షా రూపాయల నగదు,తులంన్నర బంగారం, నిత్యవసర వస్తువులు, బట్టలు తదితర వాటిని మంటలు వ్యాపిచేందడంతో అని కుటుంబం కట్టుబట్టలతో సర్వం కోల్పోయి బతికి బయటపడ్డారు.
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం.. ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి..
చంద్రయాన్ పల్లి గ్రామంలో ఆదివారం ప్రమాద వశాత్తు నివాసపు గృహం దగ్ధమైన విషయం తెలుసుకుని గ్రామానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి సందర్శించి బాధితులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి తనవంతుగా 15వేల రూపాయలు, నిత్యవసర వస్తువులు అందజేసి ఎన్నికలు అయిన వెంటనే ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని, ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎళ్ళవేళల మద్దతుగా ఉంటుందని హామీ ఇచ్చారు.ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సంతోష్ రెడ్డి, డైరెక్టర్లు గంగారెడ్డి, సిహెచ్ దాస్,తో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీపీ రమేష్ నాయక్ అర్థిక సహాయం, బియ్యం అందజేత..
ప్రమాద వశాత్తు నివాసపు గృహం దగ్ధమైన బాధిత కుటుంబానికి ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్ తనవంతు సహాయంగా ఉండేందుకు 5వేల రూపాయలు,1క్వింటల్ బియ్యాన్ని అందజేశారు.బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, ఎలాంటి సహకారమైన అందజేస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు.