ప్రమాదవశాత్తు పూరిగుడిసె దగ్ధం

నవతెలంగాణ-పెన్‌పహాడ్‌
ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతంతో పూరి గుడిసె దగ్ధమైన ఘటన మండలపరిధిలోని నాగులపహాడ్‌ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితులు, గ్రామస్తుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన పాండు రంగయ్య విద్యుద్ఘాతంతో పూరిగుడిసెలో మంటలు రావడంతో స్థానికులు గమనించి మంటలు ఆపేందుకు ప్రయత్నించినా మంటలు అదుపు కాకపోవడంతో ఫైరింజన్‌కు సమాచారం అందించగా వచ్చే లోపే ఇండ్లంతా కాలిబూడిదైంది. ఈ ప్రమాదంలో గుడిసెలో ఉన్న బట్టలు, బియ్యం, వ్యవసాయ పనిముట్లు, వెండి సామాను పూర్తిగా కాలిపోయింది.ఈఘటనలో సుమారు రూ.2 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది.ఈ సందర్భంగా ప్రభుత్వం బాధితున్ని ఆదుకోవాలని సర్పంచ్‌ రాయిలిలక్ష్మి శ్రీనివాస్‌, గ్రామపెద్ద కొండ జానకిరాములు విజ్ఞప్తి చేశారు.

Spread the love