– మృతుడు చేగుంట వాసిగా గుర్తింపు
నవతెలంగాణ- దుబ్బాక రూరల్
సెల్ టవర్ మరమ్మత్తు చేస్తుండగా ప్రమాదవశాత్తు యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, దుబ్బాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చేగుంట మండలం ఉల్లి తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన కమ్మరి రంజిత్ (32) వృత్తి రీత్యా సెల్ టవర్ టెక్నీషియన్ గా పనులు చేస్తున్నాడు. కాగా విధి నిర్వహణలో భాగంగా దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట గ్రామంలోని గురుకుల సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలలో సెల్ టవర్ ఎక్కి రిపేర్ పనులు చేస్తుండగా ప్రమాదవశత్తూ కింద పడి మృతి చెందాడు. సంఘటన స్థలానికి దుబ్బాక పోలీస్ లు చేరుకొని పంచనామా చేసి దర్యాప్తు చేస్తున్నామారు. పోస్ట్ మార్టం నిమిత్తం దుబ్బాక వంద పడకల ఆసుపత్రికి తరలించినట్లు దుబ్బాక ఎస్ఐ వి. గంగరాజు తెలిపారు.