‘రోడ్డుపైన వాహనాలు పార్క్‌ చేయడం వల్లే ప్రమాదాలు’

నవతెలంగాణ-బంజారాహిల్స్‌
బంజరాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ డివిజన్‌ పరిధిలోని రహదారిపై నిత్యం పదుల సంఖ్యలో వాహనాలు పార్కింగ్‌ చేయడం వల్ల అనేక ప్రమాదాలు సంభవించడం సర్వసా ధారణమైపోయింది. ఆదివారం రాత్రి ఒకచోట ఏకంగా డీసీపీకి ట్రాఫిక్‌ చిక్కులు ఎదురయ్యాయి. ఇది వరకే ఆ ఏరియాలో ఒక పబ్బుపై కేసు నమోదు చేసిన సంఘటన మరువకముందే రహదారులపై ఎక్కడబడితే అక్కడ వాహనాలు పార్కింగ్‌ చేయడంతో అవి నిత్యం రద్దీ గా ఉన్న ప్రధాన రహదారులు కావడంతో ప్రమాదాలు చోటుచేసు కుని ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు జరు గుతున్నాయి. వాహనదారులు కానీ పోలీసులు కానీ అప్ర మత్తత వహిం చకపోవడం నిర్లక్ష్యమేనని పలువురు అభిప్రా యాన్ని వ్యక్తపరుస్తున్నారు. బంజరాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ ఎల్వీ ప్రసాద్‌ మార్గం నుండి పంజాగుట్ట వరకు డేంజర్‌ జోనే వాహనాల రద్దీ ఎక్కువ. అదే సమయంలో ఓపెనలేస్‌ ఉండడంతో అక్కడక్కడ రోడ్డు పక్కన చిరువ్యాపా రస్తులు దుకాణాలు ఏ ర్పాటు చేసుకొని వ్యాపారాలు చేస్తు న్నారు. ప్రధాన రహ దారిపై రెయిన్‌బో ఆస్పత్రి వంశీరాం నిర్మాణ సంస్థలు రోడ్డుకు రెండు వైపులా ఉండడంతో ఇక్కడ ప్రైవేట్‌ వాహ నాల పార్కింగ్‌ రాత్రిపూట పనులు జరిగే వాహనాల పార్కి ంగ్‌ ఉదయం వరకు అలాగే ఉం టుంది. హైటెక్‌ సిటీకి వెళ్లే ప్రైవేట్‌ క్యాబ్‌ డ్రైవర్లు నిద్రలేక లేదా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ అప్పుడ ప్పు డు ప్రమాదాలు చోటు చేసుకుంటు న్నాయి. సోమవారం ఉదయం 5:40 గంట లకు బంజా రాహిల్స్‌ రోడ్‌నంబర్‌ 2లో రెయిన్‌బో దవాఖాన వద్ద ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని కారు ఢకొీట్టిన సంఘ టన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసు కుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలా నికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్‌ నిద్రమత్తే కారణమని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Spread the love