బాలల సంరక్షణ కేంద్రాలలో ముగ్గురు పిల్లలు కు వసతి

నవతెలంగాణ – బొమ్మలరామారం
కుషాయిగూడ ప్రాంతానికి చెందిన హరి శంకర్ రెడ్డి రెండు నెలల క్రితం ఉపాధి కోసం బొమ్మలరామారం మండలంలోని కిరాయి ఇంటిని తీసుకుని తన ముగ్గురు పిల్లలనీ ఆ ఇంటిలోనే వదిలిపెట్టి వెళ్లిపోయాడు. పిల్లలను స్థానికులు గుర్తించి పోలీసుకు మహిళా శిశు సంక్షేమశాఖ వారికి సోమవారం సమాచారం అందించడంతో పిల్లలను  రెస్క్యూ చేసి బాలల సంక్షేమ సమితి యాదాద్రి భువనగిరి ముందు హాజరు పరచగా వారు పిల్లలకి రక్షణ సంరక్షణ నిమిత్తం బాలల సంరక్షణ కేంద్రాలలో వసతి కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొమ్మలరామారం ఎస్సై శ్రీనివాస్ రెడ్డి, శిశు సంక్షేమ శాఖ నుండి హరిబాబు, నందిని, పాల్గొనడం జరిగింది.
Spread the love