నవతెలంగాణ – ఐనవోలు
మండలంలోని పెరుమాండ్ల గూడెం గ్రామ పంచాయతీ ఆవరణములో ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నందనం సొసైటీ వైస్ చైర్మన్ తక్కలపల్లి చందర్ రావు హాజరై మాట్లాడుతూ.. జయశంకర్ తెలంగాణ రాష్ట్రం కొరకు ఎంతో తపనపడి రాష్ట్రాన్ని సాధించినాటికి అమరులైనారు. వారి తుదిశ్వాస వరకు తెలంగాణ రాష్ట్రం కొరకే బ్రతికినారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి పులి వెంకటేశ్వర్లు, గ్రామ కార్యదర్శి సాయి కృష్ణ, అంగన్వాడి టీచర్ జ్యోతి, సీఏ మంగ, ఫీల్డ్ అసిస్టెంట్ కుమార్, ఆశ వర్కర్ ఎలిషా తదితరులు పాల్గొన్నారు.