పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి: ఏసిపి ప్రభాకర్ రావు

నవతెలంగాణ-ఆర్మూర్
బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవలని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రభాకర్ రావు తెలిపారు. పట్టణంలోని పెర్కిట్ ఎంఆర్ గార్డెన్లో శాంతి సమావేశం సోమవారం నిర్వహించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చట్టాన్ని ఎవ్వరూ చేతుల్లోకి తీసుకోకూడదని, చట్టంకు లోబడి వ్యవహరించాలని, పండుగ సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశామని తెలిపారు.. ఎలాంటి సంఘటనలు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కేసులు నమోదు అయితే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్, వైస్ చైర్మన్ షేక్ మున్నా, స్టేషన్ హౌస్ ఆఫీసర్ సురేష్ బాబు ,న్యాయవాది గటాడి ఆనంద్,, లక్కం ప్రభాకర్, మార్కాజ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love