కాసేపట్లో నాంపల్లి కోర్టుకు ఏసీపీ ఉమా మహేశ్వరరావు

నవతెలంగాణ – హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావును ఏసీబీ ప్రశ్నిస్తోంది. కాసేపట్లో ఏసీబీ హెడ్ క్వార్టర్స్‌ నుంచి ఉమామహేశ్వరరావును నాంపల్లి కోర్టులో అధికారులు హాజరుపర్చనున్నారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆయనను ఏసీబీ అధికారులు కస్టడీకి కోరనున్నారు. అయితే ఒక్కొక్కటిగా ఏసీపీ అవినీతి భాగోతాలు బయటకొస్తున్నాయి. సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని ఉమామహేశ్వరరావు ట్యాబ్‌లో రాసుకున్నట్లు అధికారులు గుర్తించారు.

Spread the love