నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న తనిఖీల్లో అక్టోబర్ 9 నుంచి ఈనెల 5వ తేదీ ఉదయం 9 గంటల వరకు స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.490.60 కోట్లకు చేరింది. ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ పట్టుబడుతున్న సొత్తు పెరుగుతున్నదని అధికారులు చెప్తున్నారు. నవంబర్ 4వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 9 గంటలకు వరకు జరిగిన తనిఖీల్లో రాష్ట్ర వ్యాప్తంగా రూ.2.53 కోట్ల నగదు పట్టుబడింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన అక్టోబర్ 9 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు పట్టుబడిన మొత్తం నగదు రూ. 173.32 కోట్లకు చేరిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ తెలిపారు. అక్రమ సరఫరాలద్వారా పట్టుబడిన మొత్తం మద్యం విలువ రూ.60.09 కోట్లు ఉన్నదనీ, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల విలువ రూ. 28.61 కోట్లు, బంగారం, వెండి, ఇతరత్రా స్వాధీనాల విలువ రూ. 176.05 కోట్లు, కుక్కర్లు, చీరలు,క్రీడా సామాగ్రి సహా ఇతర వస్తువలు విలువ రూ.52.51 కోట్లు ఉన్నాయని వివరించారు.