ఊహకు అతీతంగా ఉండే యాక్షన్‌

Action beyond imaginationరవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ అభిషేక్‌ అగర్వాల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ‘టైగర్‌ నాగేశ్వరరావు’. ఈ సినిమా ఈనెల 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో దీనికి యాక్షన్‌ కొరియోగ్రఫీ చేసిన ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌ లక్ష్మణ్‌ విలేకరుల సమావేశంలో ఈ చిత్ర విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
‘మేం కూడా స్టువర్ట్‌ పురం ప్రాంతంలోనే పుట్టి, పెరగడంతో ‘టైగర్‌ నాగేశ్వరరావు’ గురించి ఊహకు అందని విషయాలు విన్నాం. రన్నింగ్‌ ట్రైన్‌ ఎక్కేవారని, దొంగతనం చేస్తానని చెప్పి మరీ చేసేవారని, చెట్లపై కూడా పరిగెత్తేవారని.. ఇలా చాలా ఆసక్తికరమైన విషయాలు విన్నాం. సవాల్‌ చేసి దొంగతనం చేయడం అంత ఈజీ కాదు. రియల్‌ హీరోయిజం అంటే అదే. ఆయనకి టైగర్‌ అనే బిరుదు పోలీసులే ఇవ్వడం వండర్‌. ఇందులో యాక్షన్‌ని చాలా రియలిస్టిక్‌గా కంపోజ్‌ చేశాం. రవితేజ బాడీ లాంగ్వేజ్‌ ‘టైగర్‌ నాగేశ్వరరావు’ పాత్రకు పర్ఫెక్ట్‌గా యాప్ట్‌ అయ్యింది. ఆయనకు ఈ సినిమా ఒక మైలు రాయి అవుతుందనే నమ్మకం ఉంది. దర్శకుడు వంశీ ఈ సినిమా కోసం మూడేళ్ళ పాటు డీప్‌గా పరిశోధన చేశాడు. అద్భుతమైన కథని తయారు చేసి చాలా గొప్పగా ప్రజెంట్‌ చేశారు. ఈ సినిమాతో వంశీకి చాలా మంచి పేరువస్తుంది. నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ ఇందులో ఫైట్స్‌ చూసి చాలా ఆనందపడ్డారు. ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇలాంటి సినిమాకి పనిచేయటం మా ఫైటర్స్‌కి కూడా ఒక సవాల్‌తో కూడుకున్న కంపోజిషన్‌’ అని తెలిపారు.

Spread the love