యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ షురూ..

Action entertainer Shuru..హీరో నాగ శౌర్య తన నూతన చిత్రాన్ని అనౌన్స్‌ చేశారు. నూతన దర్శకుడు రామ్‌ దేశిన (రమేష్‌) దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని శ్రీ వైష్ణవి ఫిలింస్‌ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ఈ నూతన చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ శనివారం ప్రారంభమైంది. దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌, వైవిఎస్‌ చౌదరి, శ్రీను వైట్ల వద్ద డైరెక్షన్‌ డిపార్ట్మెంట్‌లో రమేష్‌ వర్క్‌ చేశారు. అనేక విజయవంతమైన చిత్రాలకు సహ రచయితగానూ పనిచేశారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రంలో సముద్రఖని, రాజేంద్ర ప్రసాద్‌, సాయికుమార్‌, మైమ్‌ గోపి, శ్రీదేవి విజరుకుమార్‌లతో సహా ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో ీరో నాగశౌర్య ప్రేక్షకులను, ఆయన అభిమానులను అలరిస్తున్నారు. ఈ సినిమాలోనూ ఆయన పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. దర్శకుడు ఈ కథను అద్భుతమైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్‌ హంగులతో ఈ చిత్రాన్ని నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు రాజీపడకుండా నిర్మించబోతున్నారు అని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: రామ్‌ దేశిన (రమేష్‌), నిర్మాత: శ్రీనివాసరావు చింతలపూడి, డీవోపీ: రసూల్‌ ఎల్లోర్‌, సంగీతం: హారిస్‌ జైరాజ్‌, ఆర్ట్‌: రాజీవ్‌ నాయర్‌, ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, పథ్వీ, కొరియోగ్రాఫర్లు: రాజు సుందరం, ప్రేమ్‌ రక్షిత్‌, వీజే శేఖర్‌, శోభి పాల్రాజ్‌, లిరిక్స్‌: చంద్రబోస్‌, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్‌, కష్ణకాంత్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యుసర్‌: సుధాకర్‌ వినుకొండ.

Spread the love