యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌

రామ్‌ పోతినేని, బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతున్న పాన్‌ ఇండియా మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘స్కంద- ది ఎటాకర్‌’. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసుకుంది. దీంతో సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాల జోరుని మేకర్స్‌ పెంచారు. ఇందులో రిలీజ్‌ చేసిన టైటిల్‌ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించగా, తమన్‌ స్కోర్‌ చేసిన ఫస్ట్‌ సింగిల్‌ మ్యూజిక్‌ చార్ట్‌లలో టాప్‌లో ఉంది. తాజాగా చిత్రంలోని సెకండ్‌ సింగిల్‌కి సంబంధించి మేకర్స్‌ అప్డేట్‌ ఇచ్చారు. ఈనెల 18న ‘గందారబారు..’
అంటూ సాగే రెండో పాటని విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌లో రామ్‌, శ్రీలీల పార్టీ వేర్‌లో కలర్‌ఫుల్‌గా కనిపించారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్‌ డిటాకే కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌ సౌత్‌, పవన్‌ కుమార్‌ సమర్పిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్‌ 15న
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.ఈ చిత్రానికి ఎడిటింగ్‌ : తమ్మిరాజు

Spread the love