‘గార్సియా స్కూల్‌పై చర్యలు తీసుకోవాలి’

నవతెలంగాణ-పరిగి
సెయింట్‌ గొన్సాలో గార్సియా ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ అసెంబ్లీ కన్వీ నర్‌ నరసింహులు అన్నారు. సోమవారం పరిగి పట్టణ కేంద్రంలోని సెయింట్‌ గొన్సాలో గార్సియా ఇంగ్లీష్‌ మీ డియం పాఠశాలలో పుస్తకాలు, యూనిఫార్మ్స్‌ అధిక ధర లకు విక్రయిస్తున్నారని ఏబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. మండల విద్యాధికారి వచ్చి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చే శారు. అధికారులు బుక్స్‌, యూనిఫామ్‌ ఉన్న గదికి తా ళం వేశారు. ఆయన మాట్లాడుతూ సెయింట్‌ గొన్సాలో గార్సియా పాఠశాల యజమాన్యం నిబంధనలను విరు ద్ధంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫార్మ్స్‌ అమ్ముతున్నారని ఇష్టం వచ్చిన రీతిలో ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. అధికారులు పాఠశాల పై చర్యలు తీసుకోవాలని డిమాం డ్‌ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు ఉపేం దర్‌, నరసింహ, గణేష్‌, సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love