డయాగ్నోస్టిక్‌ సెంటర్ల సిండికేట్‌పై చర్యలు తీసుకోవాలి

Action should be taken against syndicate of diagnostic centers– కలెక్టర్‌కు సీఐటీయూ వినతి
నవతెలంగాణ – కరీంనగర్‌
డయాగ్నోస్టిక్‌ సెంటర్ల సిండికేట్‌పై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, ఎడ్ల రమేష్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి మాట్లాడుతూ.. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రయివేట్‌ డయాగ్నోస్టిక్‌ సెంటర్లలో పాథలాజికల్‌ సెంటర్లు, ల్యాబ్‌లు కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో సిండికేట్‌గా మారి వివిధ టెస్టులకు, స్కానింగ్‌లకు, ఎక్స్రేలకు, రక్త, మూత్ర పరీక్షలకు అసాధారణంగా చార్జీలు వసూలు చేస్తున్నారని అన్నారు. గతం కంటే దాదాపు 30 శాతం రేట్లు పెంచేసి, పేషెంటలను తీవ్ర ఆర్థిక దోపిడికి గురిచేస్తున్నారని తెలిపారు. వర్షాకాలం సీజన్‌ వ్యాధుల నేపథ్యంలో అధిక మొత్తంలో డబ్బులు చెల్లించలేక పేషెంట్లు, వారి కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతన్నాయని, అవసరం ఉన్నా లేకున్నా కొంతమంది డాక్టర్లు టెస్టులు రాయడం, సెంటర్స్‌ నుంచి 50శాతం డబ్బులు తిరిగి వారు పొందడం సర్వసాధారణంగా జరుగుతుందన్నారు. ల్యాబ్‌లు, డయాగ్నోస్టిక్‌, పాథలాజికల్‌ సెంటర్లు వారు నిర్వహించే పలు రకాల టెస్టులకు అయ్యే ఖర్చులు పేషంట్ల నుంచి వసూలు చేస్తున్న చార్జీలలో 30 శాతం లోపే ఉంటాయని, అయినప్పటికీ సిండికేట్‌గా మారి మరింత దోపిడీకి ఇటీవల కాలంలో తెరలేపారని అన్ారు. డయాగ్నోస్టిక్‌ సెంటర్ల దోపిడీని అరికట్టాలని సీఐటీయూ డిమాండ్‌ చేస్తోందన్నారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్‌ సౌకర్యాలు, సిటీ స్కానింగ్‌తో పాటు డిజిటల్‌ ఎక్స్రే, మిగతా విభాగాలు పని చేసేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

Spread the love