
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామంలో బిఆర్ఎస్, బీజేపీ పార్టీల జెండాల గద్దెలను ఈనెల 7న కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్, బిజేపీ పార్టీల నాయకులు గురువారం కొయ్యుర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు రుద్రారం గ్రామంలో గత 20 సంవత్సరాల నిర్మించుకున్న బిఆర్ఎస్ పార్టీ జెండా గద్దెను, ఐదేళ్ల క్రితం నిర్మించుకున్న బిజెపి జెండాను కాంగ్రెస్ పార్టీ నాయకులు కూల్చేయడం జరిగిందని ఆరోపించారు. జెండాలు కూల్చిన నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రారం మాజీ సర్పంచ్ పగడాల ధనలక్ష్మి నారాయణ,మాజీ ఉప సర్పంచ్ బుడిగే వెంకటేష్, మాజీ మండల అధ్యక్షుడు తాజుద్దీన్, నాయకులు వాల యాదగిరి రావు, మందోట రాజబాబు, నౌళ్ళ సంపత్,పగడాల రామ్, కౌటం సతీష్, శ్రీరాముల ప్రశాంత్, సుమన్, వెంకటేష్ బిజేపీ పార్టీ గిరిజన మోర్చ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు సభవట్ నాగరాజు పాల్గొన్నారు.