మెనూ పాటించక పోతే చర్యలు..

Actions if menu is not followed..– మూగ విద్యార్ధి చికిత్సకు చేయూత..
– ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆశ్రమ పాఠశాలల విద్యార్ధులకు ప్రభుత్వం మెనూ ధరలు పెంచిన ప్రకారం మెనూ పాటించి,నాణ్యమైన భోజనం అందించాలని,విద్యార్ధుల నుండి పిర్యాదులు అందితే సంబంధిత హెచ్.ఎం,వార్డెన్ లు పై చర్యలు తీసుకుంటాం అని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హెచ్చరించారు. శనివారం ఆయన మండలంలోని అనంతారం గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసారు. భోజనం రుచికరంగా ఉంటుందా లేదా అని విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు.తరగతి గదిలో కి వెళ్ళి విద్యార్ధినుల ప్రతిభాపాటవాలను పరీక్షించారు.గాండ్లగూడెం కు చెందిన పదో తరగతి చదువుతున్న మూగ చెవిటి విద్యార్ధిని దివ్యశ్రీ కి చికిత్సకు చేయూతను ఇస్తానని,హాస్టల్ తరుపున ఆసుపత్రి లో వైద్యం చేయించాలని హెచ్ ఎం సరోజినీ కి సూచించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పదో తరగతి లక్ష్యాలను సాధించాలని కోరారు. ఆయన వెంట ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజు,వార్డెన్ భాను,మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి లు ఉన్నారు.

Spread the love