పార్టీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తే చర్యలు తప్పవు

రుద్రారం కాంగ్రెస్ గ్రామశాఖ నుంచి మల్లయ్య తొలగింపు
– ఇంచార్జి అధ్యక్షుడుగా చంద్రగిరి సంపత్
– మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య
నవ తెలంగాణ మల్హర్ రావు: కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ఎంతటివారైనా క్రమశిక్షణ చర్యలు తప్పవని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య హెచ్చరించారు. మండలంలోని రుద్రారం కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు భోగే మల్లయ్య ఇటీవల కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలు అవలంబించడమే కాకుండా,పార్టీ ఐక్యత,యూనిట్ ను దేబ్బతీసే కార్యకలాపాలకు పాల్పడినట్లుగా అధిష్టానం దృష్టికి వెళ్లినట్లుగా తెలిపారు.పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించిన మార్పు రాకపోవడంతో తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు సోమవారం నుంచీ భోగే మల్లయ్య ను కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ కార్యకలాపాలకు దూరంగా పెట్టినట్లుగా తెలిపారు.ఆలాగే రుద్రారం కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఇంచార్జిగా అధ్యక్షుడుగా చంద్రగిరి సంపత్ ను నియమించినట్లుగా తెలిపారు.

Spread the love