నీల గ్రామంలో చురుకుగా కొనసాగుతున్న ఉపాధి హామీ పనులు..

నవతెలంగాణ – రెంజల్

రెంజల్ మండలం నీల గ్రామంలోని స్థానిక చెరువులో బుధవారం ఉపాధి హామీ పథకం పనులకు కూలీలు పెద్ద మొత్తంలో హాజరై పనులను ప్రారంభించారు. రాత్రి కురిసిన అకాల వర్షానికి చెరువులో మట్టి తొలగించడానికి సుమారు 350 మంది కూలీలు ఉపాధి పనులను చేపట్టారని క్షేత్ర సహాయకుడు నారాయణ తెలిపారు.  వాతావరణం చల్లబడడంతో కూలీల సంఖ్య పెరిగిందని ఆయన తెలిపారు. వ్యవసాయ పనులు పూర్తి అవ్వడంతో చాలామంది కూలీలు ఉపాధి పనులపై దృష్టి సారించారని అన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు కొలతలను బట్టి కూలీలు పనులు చేసుకుంటున్నారని, రైతులు అట్టి మట్టిని తమ పంట పొలాల్లో కి తరలించడానికి ట్రాక్టర్ల ద్వారా ముందుకు రావడంతో కూలీలకు మరింత సులభతరంగా మారిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు సరైన సౌకర్యాలు కల్పించనప్పటికీ వాతావరణం చల్లబడడంతో వారు ఇంటి నుంచే వాటర్ బాటిల్ ని తెచ్చుకొని తమ పనులను చేసుకుంటున్నారని ఆయన అన్నారు.
Spread the love