సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలు

సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలు– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవెని శంకర్‌
నవతెలంగాణ-మంచిర్యాల
ప్రభుత్వాలు ప్రజా సమస్యలను విస్మరిస్తే ప్రజల తరపున ఎంతటి పోరాటాలకైనా న సిద్ధంగా ఉన్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవెని శంకర్‌ అన్నారు. శనివారం పట్టణంలోని ఏం కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించిన సీపీఐ జిల్లా నిర్మాణ కౌన్సిల్‌ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లడారు. కాంగ్రెస్‌పై ప్రజలు విశ్వాసంతో గెలిపించారని ఆ విశ్వసాన్ని నిలబెట్టుకొని కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. రైతు రుణ మాఫీలో రైతుల అయోమయానికి గురికాకుండా చూడాలని కోరారు. రైతు రుణ మాఫీ పై పూర్తిగా ప్రభుత్వానికే స్పష్టత లేకుండా పోయిందని అన్నారు. రేషన్‌ కార్డులు, ఆసరా పెన్షన్‌లు, వెంటనే ఇవ్వాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కేంద్రం ఆఫీస్‌ కార్యదర్శి ధూళిపాళ్ల రామచందర్‌రావు, పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య, కేరళ రాష్ట్రంలో వరద విపత్తులో మరణించిన ప్రజలకు సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సమావేశంలో సంతాపం ప్రకటించి మౌనం పాటించారు. అంతకు ముందు పార్టీ జెండాను సీనియర్‌ నాయకుడు చిప్ప నర్సయ్య ఆవిష్కరించారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు మేకల దాసు, నిర్మాణ కౌన్సిల్‌ సమావేశం జిల్లా సమితి సభ్యురాలు రేగుంట చేంద్రకళ, బొంతల లక్ష్మినారాయణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామడుగు లక్ష్మణ్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నర్సయ్య, మిట్టపల్లి వెంకట స్వామి, బొల్లం పూర్ణిమ, జోగుల మల్లయ్య, రేగుంట చేంద్రశేఖర్‌, కారుకూరి నగేష్‌, వీరభద్రయ్య, ధాగం మల్లేష్‌, లింగం రవి, మిట్టపల్లి శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

Spread the love