జగన్ కి షాకిచ్చిన నటుడు అలీ.. వైసీపీకి రాజీనామా

నవతెలంగాణ-హైదరాబాద్ :  వైసీపీ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. టాలీవుడ్ తెలుగు కమెడియన్ అలీ వైసిపి పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాకు సంబంధించి ఎలాంటి రాజకీయాలు లేవని అలీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇకపై తాను ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వనని ఆయన తెలిపారు. ఇకపై సినిమాలు చేసుకుంటానని ఆయన తెలిపారు. కాగా, ఇటీవల జగన్‌ ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారుగా అలీ పనిచేశాడు. సినీ నటుడు ఆలీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘకాలంగా నటుడిగా, కమెడియన్‌గా, నిర్మాతగా కొనసాగుతున్నారు. ఆలీ సుమారు 1000 కిపైగా సినిమాల్లో నటించారు. ఆయనకు ఇటీవలే గౌరవ డాక్టరేట్ లభించిన విషయం తెలిసిందే.

Spread the love