మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన నటుడు నాగార్జున

నవతెలంగాణ-హైదరాబాద్ : తుంటి మార్పిడి చికిత్స అనంతరం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆసుపత్రిలో కోలుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కేసీఆర్‌ను పరామర్శించారు. తాజాగా నటుడు నాగార్జున కూడా యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌‌ను కలుసుకున్నారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌ను కలుసుకోవడంపై నాగార్జున హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుంటారని తెలిపారు.

Spread the love