నటి, డైరెక్టర్ కన్నుమూత

నవతెలంగాణ-హైదరాబాద్ : కోలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. నటి, డైరెక్టర్, నిర్మాత జయదేవ్ (65) చెన్నైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా గుండె సమస్యలతో బాధపడుతున్న ఆమె చికిత్స తీసుకుంటూ మరణించారు. డాన్సర్ గా కెరీర్ ఆరంభించిన జయదేవి…. తర్వాత నటిగా పలు చిత్రాల్లో నటించారు. నలమ్ నలమగీయ, విలాంగు మీన్, పాశం ఒరువేషం చిత్రాలకు డైరెక్షన్ చేశారు. నిర్మాతగా మూడు చిత్రాలను నిర్మించారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ను ఇండస్ట్రీకి ఈమెనే పరిచయం చేశారు.

Spread the love