నవతెలంగాణ – అమరావతి: ముంబయి నటి కాదంబరి జెత్వానీ ఇవాళ విజయవాడలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను కలిశారు. అనంతరం ఆమె తన న్యాయవాదితో కలిసి మీడియాతో మాట్లాడారు. హోంమంత్రి అనితతో తన కష్టాలు చెప్పుకున్నానని జెత్వానీ వెల్లడించారు. గతంలో పోలీసులు తనతో వ్యవహరించిన తీరును వివరించానని, కేసు విచారణ వేగవంతం చేయాలని కోరానని తెలిపారు. విజయవాడలో ఉన్న సమయంలో తనకు రక్షణ కల్పించాలని కోరానని జెత్వానీ పేర్కొన్నారు. తనపై కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని హోంమంత్రికి విజ్ఞప్తి చేశానని వెల్లడించారు. హోంమంత్రి తనకు భరోసా ఇచ్చారని తెలిపారు.