శ్రీహరికోటకు ‘ఆదిత్య-ఎల్‌1’ చేరిక

To Sriharikota Addition of 'Aditya-L1'సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వచ్చే నెల మొదటి వారంలో ప్రయోగించనున్న ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహం తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని షార్‌ సెంటర్‌కు సోమవారం చేరుకుంది. బెంగళూరులోని యుఆర్‌రావు శాటిలైట్‌ సెంటర్లో సిద్ధం చేసిన ఈ ఉపగ్రహాన్ని కట్టుదిట్టమైన బందోబస్తు నడుమ ప్రత్యేక కంటైనర్లో ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ ఉపగ్రహాన్ని పిఎస్‌ఎల్‌విసి-57 రాకెట్‌ ద్వారా ప్రయోగించనున్నారు.
చంద్రయాన్‌-3వ రౌండ్‌ పూర్తి
శ్రీహరికోట రాకెట్‌ ప్రయోగ కేంద్రం నుండి గత నెల 14న ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-3 ఉపగ్రహం చంద్రుని చుట్టూ లూనార్‌ కక్ష్యలో మూడు రౌండ్లు తిరగడం పూర్తి చేసింది. చంద్రునికి 150 కిలోమీటర్లు సమీప కక్ష్య,177 కిలోమీటర్ల దూరపు కక్ష్యకు చేరుకుంది. చంద్రుని కక్ష్యలో నాలుగవ రౌండ్‌ను ఈ నెల 16వ తేదీ ఉదయం 8.30 గంటలకు పూర్తి చేయనుంది. ఈ నెల 23న సాయంత్రం చంద్రునిపై దిగనుంది.

Spread the love