నారాయణపేట టౌన్ : క్యాన్సర్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ మయంక్ మిత్తల్ అన్నారు. ప్రపంచ పొగాకు నివారణ దినోత్సవం సందర్బంగా బుధవారం ఉదయం స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుంచి ఆరోగ్య శాఖ అధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రపంచ పొగాకు నివారణ దినోత్సవ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మయంక్ మిత్తల్ మాట్లాడుతూ పొగాకు తినడం వలన క్యాన్సర్ బారిన పడటం ఖాయం అని, క్యాన్సర్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొ న్నారు. దేశంలో కాన్సర్ రావడానికి పొగాకు కారణం అని, పొగాకు అన్ని రకాలుగా ప్రమాదకరం. క్యాన్సర్ పై ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు. క్యాన్సర్ అనేక రకలలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ రాం మనోహర్ రావు, డాక్టర్ సౌభాగ్య లక్ష్మి, భిక్షపతి, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.