రీజినల్‌ పాస్‌పోర్టు కార్యాలయంలో అదనపు కౌంటర్లు

నవతెలంగాణ – హైదరాబాద్‌: పాస్‌పోర్టుల కోసం పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని రీజినల్‌ పాస్‌పోర్టు కార్యాలయంలో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు సికింద్రాబాద్‌లోని రీజినల్‌ పాస్‌పోర్టు కార్యాలయం ప్రకటించింది. ఇతర పాస్‌పోర్టు సేవా కేంద్రాలతోపాటు ఇక్కడా సాధారణ అపాయింట్‌మెంట్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు ప్రధాన కార్యాలయంలో ప్రీపోన్‌మెంట్‌ అభ్యర్థనలు మాత్రమే పరిశీలించేవారని, పన్నెండేళ్ల తర్వాత మరోసారి పాస్‌పోర్టుల మంజూరు ప్రక్రియ ప్రారంభమైందని ఆర్పీవో దాసరి బాలయ్య తెలిపారు. సోమవారం నుంచి బుధవారం వరకు ప్రయోగాత్మకంగా రోజూ 40 సాధారణ అపాయింట్‌మెంట్లు మంజూరు చేస్తామన్నారు.

Spread the love