రోడ్డు ప్రమాదంలో హోమ్ గార్డు మృతి నివాళులు అర్పించిన అదనపు డి.సి.పిలు

నవతెలంగాణ- కంటేశ్వర్
ఈనెల తేది: 9-8-2023 నాడు సాయంత్రం సమయంలో బాల్కొండ పోలీస్ స్టేషన్ యందు విధులు నిర్వహిస్తున్న ఎమ్. జలంధర్, హోమ్ గార్డు  764, ను ద్విచక్ర వాహనంపై వెళ్లే సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనగా హుటాహుటిన బుధవారం నిజామాబాద్ లోని మనోరమ హస్పటల్కు తరలించి చికిత్స నిర్వహిస్తుండగా అర్ధరాత్రి సమయంలో మృతి చెందారు. మృతుడి స్వస్థలం తాళ్లరాంపూర్ గ్రామం ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలోని పోస్టుమార్టం గది వద్ద నిజామాబాద్ అదనపు పోలీస్ కమీషనర్ ( ఎల్ & ఓ ) ఎస్. జయీ రామ్ అదనపు పోలీస్ కమీషనర్  పి. గిరిరాజు ( ఎ.ఆర్ ) హజరయి పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించి మౌనం పాటించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చినారు. ఇట్టి అంత్యక్రియలు ఈరోజు బాల్కొండలో మధ్యాహ్నం నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా రిజర్వు ఇన్స్పెక్టర్  వెంకటప్పల నాయుడు, ఏర్గట్ల ఎస్.ఐ మచ్చెంధర్ రెడ్డి, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love