అదనపు ప్రభుత్వ న్యాయవాది సరసం చిన్నారెడ్డికి ఘన సన్మానం

Additional Government Advocate Sarasam Chinnareddy is a great honorనవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన సీనియర్ న్యాయవాది సరసం చిన్నారెడ్డి అదనపు ప్రభుత్వ న్యాయవాదిగా నూతనంగా నియమితులైనందునకు హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఇటీవలే ఆర్మూర్ న్యాయస్థానం పరిధిలో గల న్యాయ స్థానాలకు సీనియర్ న్యాయవాది సరసం చిన్నారెడ్డిని  అదనపు ప్రభుత్వ న్యాయవాదిగా ప్రభుత్వం నియమించింది.అదనపు ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులైనందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తులు ప్రజల సమక్షంలో పూలమాల, శాలువతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తనను ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నాయకులకు, కార్యకర్తలకు సరసం చిన్నారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొమ్ముల రవీందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా డెలిగేట్ తక్కురి దేవేందర్, కిసాన్ కేత్ మండల అధ్యక్షులు బోనగిరి భాస్కర్, నాయకులు పత్రి రవి, చిలుకూరి నవీన్, తక్కురి శేఖర్, బద్దం గంగారెడ్డి, బండి ఆంజనేయులు, బైండ్ల శ్రీనివాస్, మారుపాక నరేష్, బద్దం సుభాష్, రాజేందర్, బద్దం  తిరుపతి, అవారి సతీష్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love