భూ గురుత్వాకర్షణ పరిధి దాటి వెళ్లిన ఆదిత్య ఎల్-1

నవతెలంగాణ- హైదరాబాద్: అంతరిక్ష పరిశోధన రంగంలో ఇస్రో విజయ ప్రస్థానం కొనసాగుతోంది. ఇటీవల చంద్రయాన్-3 గ్రాండ్ సక్సెస్ కాగా, తాజాగా, సూర్యుడి గురించి పరిశోధనల నిమిత్తం ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 స్పేస్ క్రాఫ్ట్ సాఫీగా ముందుకు వెళుతోంది. ఇప్పటికే భూమి నుంచి 9.2 లక్షల కిలోమీటర్ల దూరం వెళ్లిన ఈ వ్యోమనౌక ప్రస్తుతం భూ గురుత్వాకర్షణ పరిధిని దాటినట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వెల్లడించింది. ఆదిత్య ఎల్-1 ఇప్పుడు భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లెగ్రేంజ్ పాయింట్ 1 దిశగా వెళుతోందని వివరించింది. లెగ్రేంజ్ పాయింట్ వద్ద భూమి, సూర్యుడి గురుత్వాకర్షణ బలాలు సమానంగా ఉంటాయి. ఇక్కడి నుంచి సూర్యుడిపై పరిశోధనలు చేపట్టేందుకు ఉపగ్రహాలకు అనువుగా ఉంటుంది.

Spread the love