నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండల కేంద్రంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పాల్గొని కొమరం భీమ్ గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం గిరిజన సాంప్రదాయ నృత్యాలు చేసారు. ఈ కార్యక్రమంలో వగ్గెల పూజ,ఆదివాసి సంఘ నాయకులు పాల్గొన్నారు.