అగ్ని ప్రమాదానికి గురైన ఆదివాసీలను ఆదుకోవాలి

– సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కే.బ్రహ్మాచారి
– విద్యుత్‌ ఘాతంతో పూరీల్లు దగ్ధం
– సుమారు ఐదు లక్షల ఆస్థి నష్టం
నవతెలంగాణ-చర్ల
మండల పరిధిలోని కలివేరు పంచాయతీ రాజ్బలీ కాలనీ గ్రామానికి చెందిన బుటారి జోగయ్యకు చెందిన పూరీల్లు విద్యుత్‌ ఘాతంతో పూర్తిగా కాలిపోయింది. ఆ ఆదివాసీ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కే. బ్రహ్మచారి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుటారి జోగయ్య, బుటారి నానెమ్మ భార్యాభర్త ఇద్దరు పొలం పనికి వెళ్లిన సమయంలో తన పూరీల్లు కి ఉన్న విద్యుత్‌ మీటర్‌ వద్ద సార్ట్‌ సర్క్యూట్‌ జరిగి గృహోపకరణాలు అన్ని పూర్తిగా ఖాళీ బూడిదయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తన ఇంట్లో మొదటి విడత పత్తి అమ్మిన డబ్బులు సుమారు మూడు లక్షలు, సుమారు తులం బంగారం, పది బస్తాల సాంబ మసూరి పాత ధాన్యం, రెండో విడత తీసిన సుమారు మూడు క్వింటాల పత్తి పూర్తిగా ఖాళీ బూడిదగడం జరిగింది. అంతేకాక ఇంట్లో ఉన్న టీవీ, బీరువాలో ఉన్న బట్టలు కూడా బూడిదయ్యాయి. వంటిమీద ఉన్న బట్టలు తప్ప ఏమీ మిగల్లేదని భార్యాభర్త సిపిఎం పార్టీ సభ్యుల ముందు మొరపెట్టుకున్నారు.
మంటలను ఆర్పిన సిఆర్పిఎఫ్‌ బలగాలు
గ్రామాల్లో ఎవరు లేకపోవడం మంటలు ఎగిసిపడుతూ ఉండగా సమీపంలో ఉన్న సీఆర్పిఎఫ్‌ 151 బెటాలియన్‌ జవాన్లు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని నీళ్లు చల్లి మంటలను అదుపు చేశారు. అప్పటికే పూర్తిగా దగ్ధమైంది. నిరుపేదలైన వారికి వెంటనే ఆర్థిక సహాయం అందించడంతోపాటు శాశ్వతంగా పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ(ఎం) అధికారులను డిమాండ్‌ చేసింది. ఆదివాసీ దంపతులను ఓదార్చిన వారిలో జోన్‌ కన్వీనర్‌ తాటి నాగమణి, మండల కమిటీ సభ్యులు మచ్చా రామారావు, దొడ్డిహరి నాగ వర్మ, పామారు బాలాజీ, సిపిఎం నాయకులు శ్రీను గ్రామస్తులు ఉన్నారు.

Spread the love