జూనియర్ అసిస్టెంట్లుగా వీఆర్ఏల సర్దుబాటు

నవతెలంగాణ-వీణవంక
వీణవంక మండల కేంద్రంలో వీఆర్ఏలుగా దాదాపు 51 మంది వీఆర్ఏలు ఉండగా అందులో 38 మందికి వారి యొక్క అర్హతలను బట్టి ఆయా మండలాలకు పంపించడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్లుగా 8, రికార్డ్ అసిస్టెంట్ గా 6, సబార్డినేటర్గా 1, పదోన్నతి పొందడం జరిగింది .విశేషం ఏమిటంటే గత కొన్ని సంవత్సరాలుగా ఇదే మండలానికి వీఆర్ఏలుగా వారి యొక్క కష్టానికి ఫలితంగా ఇదే మండలానికి జూనియర్ అసిస్టెంట్లుగా దాసరపు రవీందర్, వోరెం భాను ప్రసన్న, బత్తుల కిషోర్,అందులో ముగ్గురు రికార్డు అసిస్టెంట్లుగా మద్దుల తిరుపతి,ముద్దమల్ల శ్రావణ్, కర్నే హరీష్, మేమందరము ఇదే మండలానికి కొన్ని సంవత్సరాలుగా పని చేస్తూ మళ్ళీ ఇదే మండలానికి పదోన్నతి పై బాధ్యతలు చేపట్టడం మాకు సంతోషంగా ఉంది అన్నారు. మా సేవలను గుర్తించి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మా చదువులను బట్టి పదోన్నతి ఇప్పించినందుకు మేము వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ రవీందర్ లో పాల్గొన్నారు.

Spread the love