ఆ నాలుగు శాఖ‌ల్లో వీఆర్ఏల స‌ర్దుబాటు..!

స‌చివాల‌యంలో సీఎం కేసీఆర్ స‌మీక్ష
స‌చివాల‌యంలో సీఎం కేసీఆర్ స‌మీక్ష

నవతెలంగాణ హైద‌రాబాద్ : రాష్ట్రంలో వీఆర్ఏల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌, స‌ర్దుబాటుపై స‌చివాల‌యంలో సీఎం కేసీఆర్ నిర్వ‌హించిన స‌మీక్ష స‌మావేశం ముగిసింది. వీఆర్ఏల విద్యార్హత‌ల‌ను బ‌ట్టి  నీటిపారుద‌ల‌, పుర‌పాల‌క శాఖ‌, పంచాయ‌తీరాజ్ శాఖ్, మిష‌న్ భ‌గీర‌థ శాఖ‌లలో సర్దుబాటు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.  61 ఏండ్లు దాటిన వారి ఉద్యోగాన్ని వార‌సుల‌కు ఇచ్చేలా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేరకు సోమ‌వారం జీవో విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎస్ శాంతి కుమారి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఏ జీవన్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్యమంత్రి సలహాదారు సోమేష్ కుమార్,  సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ నర్సింగ రావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణా రావు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంఏయూడీ అరవింద్ కుమార్, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, దాసోజు శ్రవణ్, వీఆర్ఏ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love