మారుతున్న కాలంతో పాటు మన ఆరోగ్య నియమాలు కూడా మార్చుకోవాలని, పిల్లల ఆరోగ్య విషయం లో పెద్దలు శ్రద్ద వహించాలని శ్రీపాధ్ హాస్పిటల్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీపాద్ కుమార్ అన్నారు. ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే సందర్బంగా అయన మాట్లాడారు…
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
ఆర్గానిక్ పదార్థాలనే వాడేలా ప్రోత్సహించాలి : డాక్టర్ శ్రీపాద్ కుమార్
నేడు సమాజంలో అన్ని వస్తువులు మొత్తం కలుషితం అయ్యాయని, ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని జాగ్రత్తలు తీసు కోవాలని, ముఖ్యంగా చిన్న పిల్లలకు జంకు ఫుడ్ పెట్టకూడద ని, చిప్స్, మైదా పిండి పదార్థాలు, బిస్కెట్లు, కూల్ డ్రింక్స్, భర్గర్ల వంటివి అసలు అలవాటు చేయకూడదన్నారు. మైదా పిడి పదార్థాలు స్మోకింగ్ కంటే కూడా ఎక్కువ ప్రమాదమని, కూల్ డ్రింక్స్‌ను అసలు వాడకూడదన్నారు. వీటివల్ల చిన్నప్ప టి నుండే రక్త హీనత వంటివి, థైరాయిడ్ వంటి రోగాలు వస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు పిల్లలకు ఇవ్వకూడదని, వాటిలోని రెడీయేషన్ వల్ల బ్రెయిన్ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని, వాటివల్ల డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసు కున్న సందర్భా లున్నాయని కాబట్టి వాటికి దూరంగా ఉం డాలని సూచించారు. రానున్న ముందు తరాలకు చాలా ప్రమా దం పొంచివున్నందున మొబైల్ ఫోన్ లను వీలైనంత వరకు వాడ కపోవడమే మం చిదన్నారు. వాటివల్ల ఎడక్ట్ అయిన వారి కోసం డి అడిక్షన్ సెం టర్లు ఏర్పాటు చేయ డం చూస్తుంటేనే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. ఆరోగ్య నియమాలు పూర్తిగా మార్చుకో వాలని, కెమికల్స్, ఫర్టీలైజైర్స్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని, పాలిష్ బియ్యం కాకుండా దంపుడు బియ్యం వాడాలని, మిల్లెట్స్‌ను, ఆర్గానిక్ ఆహార పదార్థాలను వాడాలని కోరారు.
దేశవ్యాప్తంగా ఆర్గానిక్ పంటలపై ప్రజలకు, రైతులకు అవగాహనా కల్పించాలని, వాటిని ప్రోత్సహించాలని సూచిం చారు. చక్కటి ఆహార నియమాలు పాటిస్తూ, కలుషిత పదా ర్థాలను, రేడిమెడీ పదార్థాలను పూర్తిగా నిషేదించాలని, ఆకు కూరలు, పండ్లు తీసుకుంటూ వ్యయమాలు చేస్తూ ఆరోగ్యం గా ఉండాలని ముందు తరాల వారికీ ఆదర్శంగా ఉండాలని సూచించారు.