ముంబయి: ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) కోసం సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసినట్లు అడ్వాన్స్‌డ్ సిస్-టెక్ లిమిటెడ్ తెలిపింది. ముసాయిదా ప్రాస్పెక్టస్ (డిఆర్‌హెచ్‌పి) ప్రకారం.. రూ.115 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయాలని యోచించింది. ఇందుకోసం ప్రస్తుత ప్రమోటర్లు 15.27 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్‌ఎస్) విధానంలో విక్రయించనున్నారు. ప్రమోటర్లయిన ముకేష్ ఆర్ కపాడియా, ఉమెద్ అమర్‌చంద్ ఫిఫాద్రా తలో 7.64 లక్షల షేర్లను అమ్మకానికి పెట్టారు. ప్రస్తుతం ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు కంపెనీలో 82.57 శాతం వాటాలు ఉన్నాయి.