హైదరాబాద్ : బ్యాంకింగేతర విత్త సంస్థ అడ్విక్ కాపిటల్ నిధుల సమీకరణకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం అల్టర్నేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ (ఎఐఎఫ్) అనుమతుల కోసం సెబీకి దరఖాస్తు చేసుకున్నట్లు ప్రకటించింది. ఆర్‌బిఐ గుర్తింపు పొందిన ఈ ఎన్‌బిఎఫ్‌సి ఎఐఎఫ్-2 కేటగిరి లైసెన్స్ అనుమతి కోరింది. ఎఐఎఫ్ ద్వారా రూ.250 కోట్ల నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అడ్విక్ కేపిటల్ తెలిపింది.