విషాదం.. ఉరేసుకొని అడ్వకేట్‌ ఆత్మహత్య

నవతెలంగాణ – రంగారెడ్డి : నార్సింగిలో విషాదం చోటు చేసుకుంది. నార్సింగి, పుప్పాల్ గూడలో ముఖర్జీ అనే న్యాయవాది తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ తగాదాల వల్లే బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. కాగా, గత కొన్ని రోజులుగా ఆయన భార్య అతడికి దూరంగా ఉంటున్నది. ఇటు భార్య దూరమవడం, ఆర్థిక సమస్యలతో కలత చెందిన ముఖర్జీ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసలు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు.

Spread the love