కమాన్ పూర్, రొంపి కుంట సబ్ స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ కు అంతరాయం ఏర్పడుతుందని ఎన్పీడీసీఎల్ ఏఈ నాలా అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలనుండి 12 గంటల వరకు ఈ రెండు సబ్ స్టేషన్ల పరిధిలో మరమ్మతుల దృశ్య విద్యుత్ కు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. దీంతో మండల కేంద్రంతో పాటు జూలపల్లి, గుండారం, నాగారం, రొంపికుంట, పేరపల్లి, గుండారం, పెంచికల్ పేట, సిద్దిపల్లె, లింగాల, రాజాపూర్ గ్రామాల్లో విద్యుత్ 2 గంటలపాటు నిలిచిపోతుందని వినియోగదారులు సహకరించాలని కోరారు.