ఏపీలో ఏఈపీ సెట్‌ ఫలితాలు విడుదల

Resultsనవతెలంగాణ-హైదరాబాద్ :  ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీ సెట్‌ ఫలితాలను మంగళవారం అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షకు 3.62 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 3.39 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈఏపీ సెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజ్‌ ఇచ్చి ర్యాంకులను విడుదల చేశారు.  గత నెల 16 నుంచి 23 వరకు ప్రభుత్వం ఈఏపీ సెట్‌ పరీక్షలను నిర్వహించారు. ఇటీవల సంబంధిత అధికారులు ప్రాథమిక కీ ని విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,95,092 మంది, అగ్నికల్చరల్‌ విభాగంలో 70,352 మంది విద్యార్థులు అర్హత సాధించారని పరీక్షల విభాగం అధికారులు వెల్లడించారు.

Spread the love