నవతెలంగాణ – హైదరాబాద్: ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆల్ రౌండర్ మహమ్మద్ నబీ సంచలన ప్రకటన చేశాడు. వన్డే క్రికెట్ కు దూరం కాబోతున్నట్లు తెలిపాడు మహమ్మద్ నబీ. తన అంతర్జాతీయ వన్డే క్రికెట్ కు వీడ్కోలు పలుకుతూ సంచలన ప్రకటన చేశాడు. దాదాపు 13 సంవత్సరాల కు పైగా ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు సేవలు అందించాడు మొహమ్మద్ నభి. అయితే ప్రస్తుతం ఆయన వయసు సహకరించకపోవడంతో రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు మహమ్మద్ నబి వివరించాడు. 2025 ఛాంపియన్ ట్రోఫీ టోర్నమెంట్ తర్వాత. అంతర్జాతీయ వన్డే క్రికెట్ కు దూరంగా ఉంటానని తెలిపాడు. అప్పటివరకు మాత్రమే వన్డే క్రికెట్ ఆడతానని వివరించాడు. ఇది ఇలా ఉండగా 2009 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు మహమ్మద్ నబి. ఇక ఇప్పటివరకు 165 వన్డేలు ఆడిన ఆయన 3549 పరుగులు చేశాడు. అలాగే 171 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. 2019 సంవత్సరంలోనే టెస్టుల నుంచి తప్పుకున్న మహమ్మద్ నబీ ఇప్పుడు వన్డేలోకి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే.. తాజా ప్రకటనతో టి20లో ఆడుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.