సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరాహార దీక్ష

నవతెలంగాణ-సిరిసిల్ల రూరల్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని విద్యాశాఖ పరిధిలోని సమగ్ర శిక్ష ఉద్యోగుల 22 వ రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది.రిలే నిరాహార దీక్షలో భాగంగా ఆది పూజ్యుడు వినాయకుడికి పూజ చేశారు. ఉండ్రాలు, పాయసం, ఎలక్కాయలు సమర్పించి సమకశిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని వేడుకున్నారు.  ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్, ఉపాధ్యక్షుడు దేవయ్య, నీరజ,  తిరుపతి, నగేష్, రాజేంద్రప్రసాద్, లక్ష్మీపతి, ఏళ్లేష్, నర్సయ్య, వినయ్, నవీన్, దేవరాజు, చంద్రయ్య, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

Spread the love